10 AUGUST 2023

200 రోజులు ఆడిన వాల్తేరు వీరయ్య.. బాస్ క్రేజ్ ఆ మాత్రం ఉంటుందిగా..

ఈ రోజుల్లో ఓ సినిమా 30 రోజులు ఆడితేనే అద్భుతం.. అంతకు మించి ఆడితే చరిత్ర..ఓటిటి రాజ్యమేలుతున్న రోజులు 

ఓ సినిమా 200 రోజులు ఆడటం అనేది అసాధ్యం.. అలాంటిదిప్పుడు ఓ సినిమాకు ఏకంగా 200 రోజుల వేడుక చేసారు..

మరోవైపు ఇంకో సినిమాకు 100 రోజుల వేడుక జరిగింది. అసలు టాలీవుడ్‌లో ఏం జరుగుతుంది..? ఈ విచిత్రాలేంటి..?

ఆచార్య, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు నిరాశ పరిచిన తర్వాత.. వాల్తేరు వీరయ్యతో నిజంగానే అభిమానులందరికీ అదిరిపోయే సక్సెస్ పార్టీ ఇచ్చేసారు చిరంజీవి.

రొటీన్ కథ అంటూ కొందరు పెదవి విరిచినా.. మెగా స్టామినా ముందు అవన్నీ నిలబడలేదు. 

తాజాగా ఈ సినిమా 200 రోజుల సంబరాలు చేసుకున్నారు మేకర్స్.

ఈ రోజుల్లో ఓ సినిమా 200 రోజులు ఆడటం అనేది అసాధ్యం. కానీ 

ఏపీలోని ఒక థియేటర్‌లో 200 రోజుల రన్ పూర్తి చేసుకుంది వీరయ్య.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు 200 రోజుల షీల్డ్‌ ప్రధానం చేసారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ..

200 రోజుల వేడుక ఆనందంగా ఉందని.. ఇండస్ట్రీ మళ్లీ పాత రోజుల్లోకి వెళ్తుందని చెప్పారు.