26 August 2023

మోహన్ లాల్ నుండి ఫాఫా వరకు అతిధి పాత్రలో మలయాళం స్టార్స్.. లిస్ట్ పెద్దదే.!

అతిథి పాత్రలతో పాన్ ఇండియా స్కెచ్‌ రెడీ చేస్తున్న హీరోల విషయంలో స్టార్ హీరోల జోరు కాస్త ఎక్కువగా కనిపిస్తోంది.

నేషనల్ సినిమాల్లో గెస్ట్‌, విలన్‌ రోల్స్‌తో పరిచయం అయి, ఆ తరువాత హీరోగా ప్రూవ్ చేసుకుంటున్నారు మాలీవుడ్ స్టార్స్‌.

పుష్ప లో అతిథి పాత్రలో కనిపించిన ఓటీటీ స్టార్‌ ఫహాద్ ఫాజిల్. పుష్ప 2 మెయిన్‌ విలన్‌గా ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేస్తున్నారు.

ప్రజెంట్ ప్రభాస్ సలార్‌లో నెగెటివ్‌ రోల్‌ చేస్తున్న పృథ్వీరాజ్‌, ఆల్రెడీ పాన్ ఇండియా మూవీస్‌కు రెడీ అయిపోయారు. 

సూపర్ స్టార్ రజినికాంత్ జైలర్‌ సినిమాలో మోహన్ లాల్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించి థియేటర్స్ లో విజుల్స్ వేయించారు.

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ మూవీలో స్పెషల్ పాత్రలో నటించిన మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి (ముహమ్మద్ కుట్టి).

ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో మలయాళం స్టార్ మోహన్ లాల్ కూడా అతిధి పాత్రలో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు.

అలా వైకుంఠపురంలో జై రామ్ పాత్ర ఎంత కీలకమో అందరికి తెలిసిందే.. విలక్షమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యారు.