అందాల హద్దులు చెరిపేసిన మాళవిక.. కుర్రాళ్లు కునుకేయడం కష్టమే.!

Ravi Kiran

23 May 2024

సోషల్ మీడియాలో మాళవిక మోహనన్‌ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు హాట్‌ హాట్‌ లుక్స్‌తో, లేటెస్ట్ ఫోటో షూట్స్‌తో నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది. 

ఈమె నెట్టింట ఏదైనా పోస్ట్ పెట్టిందంటే చాలు.. లక్షల్లో లైకులు, కామెంట్లు వచ్చిపడతాయి. రెబల్ స్టార్ ప్రభాస్‌, దర్శకుడు మారుతి కాంబోలో వస్తున్న హారర్ కామెడీ సినిమా 'రాజాసాబ్‌'లో హీరోయిన్‌గా నటిస్తోంది మాళవిక మోహనన్.

ఇటీవల నెట్టింట ఫాలోవర్స్‌తో చిట్‌చాట్ చేసిన ఈ అందాల భామ. తన డ్రీమ్ రోల్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. నేను గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో నటించాలనుకుంటున్నా.

ఓ యువతిని కూల్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. నిజమేనా..? ఇప్పుడు నేను యాక్షన్‌ సీక్వె్న్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నా. యాక్షన్‌ పార్టుకు సంబంధించి నన్ను మరింత ఎలివేట్ చేసుకోవడం ఫన్‌గా ఉంటుందంది. 

మరి రాబోయే రోజుల్లో మాళవిక మోహనన్ నుంచి యాక్షన్‌ సినిమాలు వస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మాళవిక ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా నటిస్తోన్న తంగలాన్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. 

రజనీకాంత్ ‘పేట’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది ఈ భామ.  ఆ తర్వాత విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మాస్టర్’ సినిమాలో నటించి మెప్పించింది.