ఎన్నికల సందడి అయిపోయింది. దేశంలో ఎన్టీయే ప్రభుత్వం అధికారం దక్కించుకుంది. అటు ఏపీలోనూ కూటమి విజయం సాధించింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసిన పలువురు సెలబ్రిటీలు విజయభావుటా ఎగురవేశారు
TV9 Telugu
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా ఎన్నికైంది
TV9 Telugu
మలయాళ నటుడు సురేష్ గోపీ రికార్డ్ సృష్టించారు. త్రిసూర్ నుంచి ఎంపీగా గెలిచారు. కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయం కావడం విశేషం
TV9 Telugu
టీవీ సీరియల్ 'రామాయణ్'తో చాలా గుర్తింపు తెచ్చుకున్న రాముడు పాత్రధారి అరుణ్ గోవిల్.. ఈసారి మీరట్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు
TV9 Telugu
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చేసిన రచనా బెనర్జీ.. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచి ఎంపీగా జయకేతనం ఎగరవేసింది
TV9 Telugu
'రేసుగుర్రం' విలన్ రవికిషన్.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా ఈయన రెండోసారి గెలిచారు
TV9 Telugu
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ హేమామాలిని.. ఉత్తరప్రదేశ్‌లోని మధుర నుంచి ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించడం విశేషం
TV9 Telugu
బాలీవుడ్ నటుడు శత్రుజ్ఞ సిన్హా, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ, పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు