IT - వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్‌లో యాండీ ముషియెట్టి డైరెక్షన్లో తెరకెక్కిన IT ఫిల్మ్ 2017 సెప్టెంబర్లో రిలీజ్ అయి బిగ్ హిట్ అయింది. దీనికి సీక్వెల్ గా 2019లో IT Chapter 2 ఫిల్మ్ కూడా వచ్చి.. అందర్నీ ఆకట్టుకుంది.
Insidious - ఇదో హర్రర్ ఫిల్మ్ సిరీస్ . ఇప్పటి వరకు ఈ ఫిల్మ్ సిరీస్‌లో 5 సినిమాలు రిలీజ్ అయి అందర్నీ వణికించేశాయి. ఇక ఇందులోనే 5th ఫిల్మ్ Insidious: The Red Door రీసెంట్‌గా రిలీజ్ అయి వరల్డ్ వైడ్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Sinister - 2012లో వచ్చిన ఈ హర్రర్ ఫిల్మ్ అప్పట్లో సెన్సేషన్ అయింది. ఇప్పటికే చూసిన వారందర్నీ ఓ రేంజ్‌లో భయపెడుతూ థ్రిల్ పీలయ్యేలా చేస్తుంది.
Halloween - ఇది కూడా హర్రర్ ఫిల్మ్ సిరీస్. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ 2021లో వచ్చిన Halloween Kills ది బెస్ట్ హర్రర్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది అందరికీ!
The Ring - 2002లో వచ్చిన ఈ ఫిల్మ్.. అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైంది. వరల్డ్ వైడ్ చూసిన వారందర్నీ భయపెట్టేసింది.
The Shining - 1980లో రిలీజ్ అయిన ఈ సినిమాలో.. ఎన్నో చిల్ బోన్ హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ ఈ సినిమా చూస్తున్నంత సేపు షివరింగ్ అయ్యేలా చేస్తాయి.
The Texas Chainsaw - ఇదో అమెరికన్ హర్రర్ ఫ్రాంచైజీ. ఈ ఫ్రాంచైజీని మొదట కిమ్ హెన్‌కెల్ టోబ్ హూపర్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఫిల్మ్ 1974లో రిలీజ్ అయింది. ఇక అప్పటి నుంచి 2022 వరకు ఈ సిరీస్‌లో సినిమాలు వస్తూ .. అందర్నీ వణికిస్తూనే ఉన్నాయి.
The Conjuring - ఇదో అమెరికన్ సూపర్ నాచురల్ హర్రర్ ఫిల్మ్. 2013లో రిలీజ్ అయి హర్రర్ ఫుల్ హిట్టైంది. ఆ తరువాత The Conjuring 2 పేరుతో సీక్వెల్ కూడా వచ్చింది.
Hereditary - ఈ సినిమా 2018లో రిలీజైంది. ఇదో సైకలాజికల్ సూపర్ నాచురల్ హర్రర్ ఫిల్మ్. ఇక హర్రర్ ప్రియులకు ఈ ఫిల్మ్ ఓ రేంజ్లో కిక్కిస్తుంది.
The Exorcist -
ఇది కూడా ది బెస్ట్ హర్రర్ మూవీ ప్రాంచైజీ. ఇందులో ఫస్ట్ మూవీ 1973లో తెరకెక్కింది. ఇక ఈ సిరీస్లో అప్‌కమింగ్ ఫిల్మ్ The Exorcist: Believer 2023 అక్టోబర్ 6న రిలీజ్ కానుంది.