కాబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలు బయటపెట్టిన అనన్య పాండే
Pic credit - Instagram
`లైగర్` బ్యూటీ అనన్య పాండే తనకు కాబోయే వాడికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణలు బయటపెట్టింది.
`లైగర్` సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది అనన్య పాండే. బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే కూతురు అయినా తనకంటూ ఓ గుర్తింపు, ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుందీ బ్యూటీ.
ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడికి ఊహించని క్రేజ్ ఏర్పడింది. ఇక సినిమాల పరంగానూ మెప్పిస్తుంది. ప్రారంభం నుంచి ఆచితూచి సినిమాలు చేస్తుంది.
అయితే ఈ మధ్య అనన్య పాండే ప్రేమలో పడిందనే వార్తలొచ్చాయి. బాలీవుడ్ టాల్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో ఆమె డేటింగ్ చేస్తుందట. ఆ మధ్య ఇద్దరు కలిసి కారులో వెళ్తూ కెమెరాలకు చిక్కారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తనకు కాబోయే వాడికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణలు బయటపెట్టింది.
ప్రస్తుతం అనన్య పాండే `డ్రీమ్ గర్ల్ 2` చిత్రంలో నటిస్తుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు. ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కాబోతుంది.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా తనకు కాబోయే వాడి లక్షణాలు చెప్పింది అనన్య పాండే. పెళ్లికి సంబంధించిన తమ నాన్నే(చుంకీ పాండే) తనకు ఆదర్శమని చెప్పింది.
తనకు కాబోయే వారు తమ నాన్నలా దయ గుణంతో ఉండాలని, ప్రేమగా, ఫన్నీగా ఉండాలని చెప్పింది. నాన్నే తనకు బెంచ్ మార్క్ అని అందుకే ఆయనలాంటి లక్షణాలు ఉండాలని తెలిపింది.
తాను అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. మొత్తానికి కాబోయే భర్త లక్షణాలు బయటపెట్టింది. మరి ఆయా లక్షణాలున్న వాళ్లు రెడీ అయిపోవచ్చని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.