ఆ రోజున  ఖుషి ట్రైలర్ విడుదల..

8 August 2023

Pic credit - Instagram

సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’.

ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం ట్రైలర్‌ ఈ నెల 9న విడుదల కానుంది.

సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

ఈ మూవీ  తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.