అతడంటే పిచ్చి.. తెలుగులో నా ఫేవరెట్ హీరో ఆయనే.. కృతి శెట్టి..

Rajitha Chanti

Pic credit - Instagram

26 May 2026

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి 'ఉప్పెన' సినిమాతో బేబమ్మగా అడుగుపెట్టి, కుర్రకారు మనసు దోచుకున్న యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ బ్యూటీ. 

తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా, ఆ వెంటనే 'బంగార్రాజు', 'శ్యామ్ సింగరాయ్' చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

అయితే ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు బ్యాడ్ లక్ వెంటాడింది. వరుసగా ఆమె నటించిన ఆరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి.

దీంతో ఈ అమ్మడు మాలీవుడ్, కోలీవుడ్ వైపు అడుగులు వేసింది. మలయాళంలో ఆమె నటించిన 'ARM' సినిమా మంచి విజయాన్ని సాధించినా, ఆశించిన స్థాయిలో క్రేజ్ తీసుకురాలేకపోయింది.

ప్రస్తుతం కృతి శెట్టి తిరిగి టాలీవుడ్‌లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో వస్తున్న ఒక భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తోంది.

తనకు ప్రతి భాషలోనూ ఫేవరెట్ హీరోలు ఉన్నారని చెబుతూ, టాలీవుడ్‌లో తనకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటే ఎంతో ఇష్టమని మనసులో మాట బయటపెట్టింది.

తెలుగులో నాకు రామ్ చరణ్ అంటే పిచ్చి.. ఆయనే నా ఫేవరెట్ హీరో అంటూ కృతి శెట్టి ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది. దీంతో మెగా అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

భవిష్యత్తులో ఈ యంగ్ బ్యూటీకి రామ్ చరణ్ సరసన నటించే అవకాశం వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు