19 February 2024

రష్మి గౌతమ్‌ నటించిన సీరియల్స్ ఏవో తెలుసా ??

TV9 Telugu

యాంకర్‌ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు జబర్దస్త్, అనేక షోస్ లో యాంకర్ చేస్తూ  బిజీగా ఉంది.

అంతే కాదు అందం, అభినయం ఉన్న యాంకర్‌గా  వరుస షోస్ చేస్తూ బుల్లి తెరలో దుమ్మురేపుతుందనే చెప్పాలి రష్మీ.

ఇదిఇలా ఉంటే యాంకర్ రష్మి తన కెరీర్‌ ప్రారంభం లో పలు సీరియల్స్ లోనూ నటించిందన్న విషయం చాలామందికి తెలియదు.

సినిమా కంటే టీవీనే బెటర్‌ అని నిర్ణయించుకోవడానికి కారణం ఒక పరంగా  ఈ సీరియల్స్ కారణమని పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను రివీల్‌ చేసింది రష్మి.

రష్మి 2002-2003 సమయంలో 'థ్యాంక్స్' అనే చిత్రంలో  హీరోయిన్‌ తరహా రోల్‌ చేయగా రొమాన్స్ తో రచ్చ చేసింది.

'థ్యాంక్స్‌' మూవీ ద్వారా తనకు పెద్దగా పేరు. ఆఫర్లు రాకపోవడం తో ఆమె ఇంటికెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ కొంత గ్యాప్‌తో రీఎంట్రీ ఇచ్చింది.

అదే సమయంలో మా టీవీ లో  'యువ'  అనే సీరియల్‌లో నటించే ఆఫర్‌ వచ్చిందట. అందులో స్వాతి అనే పాత్రలో నటించి మెప్పించింది రష్మి.

దీంతోపాటు 'లవ్‌' అనే మరో సీరియల్‌ కూడా 'మా' టీవీలో చేయగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వీటి కారణంగా తనకు మళ్లీ సినిమా ఆఫర్లు వచ్చాయి.