ఇప్పుడే కాదు.. సలార్ షూట్ బిగినింగ్ నుంచి ఇదే ప్రాబ్లమ్. ఇండస్ట్రీ నుంచి వచ్చే లీకులకు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే న్యూసులకు ఆ మూవీ టీం నుంచి లేనేలేదు క్లారిఫికేషన్.
అందుకే సలార్ సినిమా విషయంలో ఎప్పుడూ కన్ఫూజన్. ఇక ఈ కన్ఫూజన్‌ను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ.. రీసెంట్‌గా బయటికి వచ్చింది సలార్ రిలీజ్ పోస్ట్ పోన్ అనే బిగ్ బ్రేకింగ్.
చూస్తుండగానే అయ్యింది సోషల్ మీడియా మొత్తం ఢాం.. ఢాం..! లేదెవ్వరికీ ఈ న్యూస్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్. ఇక ఈ క్రమంలోనే సలార్ రిలీజ్ పోస్ట్ పోస్ట్‌ను అఫీషియల్‌గా డిక్లేర్ చేశారు హీరో కిరణ్ అబ్బవరం.
ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న సలార్ మూవీ.. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది.
కానీ.. ఉన్నట్టుండి సెస్టెంబర్ మంత్ బిగి అయినప్పటి నుంచి.. ఈసినిమా పోస్ట్ పోన్ అయిందనే అన్ అఫీషియల్ న్యూస్ అఫీషియల్ గా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ను అయోమయానికి గురిచేస్తూ ఉంది.
ఇక ఈ క్రమంలోనే ఆ ఆయోమయాన్ని ఖతం చేశారు కిరణ్ అబ్బవరం. సలార్ సినిమా సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్ పోన్ అయిందని రీసెంట్ ప్రెస్ మీట్లో అనౌన్స్ చేశారు.
అంతేకాదు.. సెప్టెంబర్ 28 వీకెండ్ కావడంతో.. ఆ డేట్ కు అన్ని అనుకూలతలు ఉండడంతో.. తన రూల్స్ రంజన్ ను అదే రోజు రిలీజ్ చేన్నట్టు చెప్పారు ఈ హీరో.
దీంతో సోషల్ మీడియాలో సలార్ పోస్ట్ పోన కన్ఫర్మ్ అనే కామెంట్ ట్రెండ్ అవుతోంది. కిరణ్ అబ్బవరం మాటల్లో వైలర్ కూడా అవుతోంది.