'కేజీయఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి ఒక్క సినిమాతోనే తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకుంది
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే
ఈ కన్నడ బ్యూటీ ఫస్ట్ మువీతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న అవకాశాలు మాత్రం పెద్దగా రావట్లేదు
తాజాగా శ్రీనిధి తన ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది
ఈ ఫోటోల్లో శ్రీనిధి తన నుదుటిన పాపిట్లో సింధూరంతో కనిపించింది
పెళ్లైన వారు మాత్రమే పాపిట్లో బొట్టు పెట్టుకుంటారు ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు శ్రీనిధి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని ప్రచారం చేస్తున్నారు
ఐతే ఈ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది.ఎందుకంటే కర్ణాటకలోని కిన్నిగోలికి చెందిన తుళు సంప్రదాయం ప్రకారం అమ్మాయిలు ఇలా పెళ్లి కాకుండానే పాపిట్లో బొట్టు పెట్టుకుంటారు
శ్రీనిధి వారి ఆచారం ప్రకారం నుదుటిన సింధూరం పెట్టుకుందని, అ వాస్తవాలను ప్రచారం చేయొద్దని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు