Keerthy Suresh Photo

మరో తెలుగు పాన్ ఇండియా చిత్రంలో కీర్తి..

21 August 2023

Keerthy Suresh Stunning Pic

నేను శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

Keerthy Suresh Picture

ఆ తర్వాత మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో తన నటనతో అలనాటి హీరోయిన్ సావిత్రిని మరిపించింది.

Keerthy Suresh Pic

దీంతో తెలుగుతోపాటు.. తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది.

మహేష్ బాబు సర్కార్ వారి పాట చిత్రంతో గ్లామర్ పాత్రలో నటించి కుర్రాళ్ల మనసు దోచేసింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.

తర్వాత పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ దసరా చిత్రంలో పల్లెటూరు అమ్మాయిల డీగ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా భోళా శంకర్ సినిమాలో నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నష్టాన్ని చవిచూసింది.

తెలుగులో మరో బిగ్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్ ఇంచింది కీర్తి. నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతుంది.

పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించేందుకు ఓకే చెప్పింది. ప్రస్తుతం మరో నాలుగు తమిళ  సినిమాలతో బిజీగా ఉంది.