అలాంటి పాత్రల కోసమే వెయిట్ చేస్తున్నా.. కీర్తి సురేష్ మనసులోని మాటలు
Rajitha Chanti
Pic credit - Instagram
13 June 2026
కీర్తి సురేశ్ కెరీర్‌లో 'మహానటి' చిత్రం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, ఆ సినిమా తన జీవితాన్నే మార్చేసిందని ఆమె పేర్కొన్నారు.
కెరీర్ ప్రారంభ దశలోనే సావిత్రి వంటి గొప్ప నటి పాత్రను పోషించడం పట్ల మొదట్లో ఎంతో భయం వేసిందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు.
అయితే ఆ పాత్ర తనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇందులో తన నటనకు ప్రశంసలు వచ్చాయి.
ఆ సమయంలో నేను చేస్తున్నది సాధారణ పాత్ర కాదని నాకు తెలుసు, కానీ ఆ చిత్రం నన్ను ఒక నటిగా మరో స్థాయికి తీసుకెళ్లింది అన్నారు.
గతేడాది 'రివాల్వర్ రీటా', 'ఉప్పుకప్పురంబు' వంటి చిత్రాల్లో నటించినప్పటికీ, అవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు.
ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన దృష్టి మళ్లీ 'మహానటి' లాంటి బలమైన, ప్రభావవంతమైన పాత్రల పైనే ఉందని స్పష్టం చేశారు.
నటనకు ఆస్కారం ఉన్న పాత్రల కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని, అటువంటి కథలు దొరికితే తనదైన శైలిలో నటిస్తానని అన్నారు.
ప్రస్తుతం పలు భాషల్లో విభిన్నమైన కథాంశాలతో సినిమాలను ఎంచుకుంటున్న కీర్తి సురేశ్, తదుపరి ప్రాజెక్టుల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్