తెలుగులో కయాదు జోరు.. వరుస సినిమాలతో అమ్మడు బిజీ..

Rajitha Chanti

Pic credit - Instagram

10  July 2026

సినీ తారల జీవితాలు బయటకు చాలా గ్లామరస్‌గా కనిపిస్తాయి. కానీ, వారి వ్యక్తిగత జీవితంలో చేదు జ్ఞాపకాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

తాజాగా యంగ్ బ్యూటీ కాయదు లోహర్ తన టీనేజ్ రోజుల్లో ఎదురైన ఒక షాకింగ్ ఈవ్ టీజింగ్ ఘటనను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాయదు, ఓ ఇంటర్వ్యూలో తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. 16 ఏళ్ల వయసులోనే తనకు ఎదురైన పరిస్థితి వెల్లడించింది.

 నేను పదో తరగతి చదువుతున్న సమయంలో ప్రతిరోజూ ట్యూషన్ సెంటర్‌కు నడుచుకుంటూ వెళ్లేదాన్ని. ఆ సమయంలో కొందరు యువకులు నన్ను వెంబడించారు.

ఈవ్ టీజింగ్ చేసేవారు. మొదటి రెండు రోజులు ఆ గొడవలు ఎందుకని మౌనంగా ఉండిపోయాను. కానీ మూడో రోజు ఆ యువకుడు హద్దులు దాటడంతో నా సహనం నశించింది.

భయం, కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. ఆవేశంలో పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని అతని వైపు విసిరాను. ఆ రాయి నేరుగా అతని తలకు బలంగా తగిలి, రక్తం కారింది

కయదు ఆనాటి సంఘటనను వివరించారు.ఈమె చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కన్నడలో 'మొగిల్‌పేట'తో నటిగా మారింది.

'డ్రాగన్' సినిమాతో స్టార్‌డమ్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది కయాదు.