అప్పుడు అందంగా లేదని రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు గుండెల్లో గుడి కట్టారు
Rajitha Chanti
Pic credit - Instagram
15 June 2026
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రతి ఏటా ఎంతోమంది కొత్త హీరోయిన్లు అడుగుపెడుతుంటారు. కానీ, కొద్దిమంది మాత్రమే మొదటి సినిమాతోనే లేదా ఒకే ఒక్క క్యారెక్టర్‌తో ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేస్తుంటారు.
ప్రస్తుతం ఆ జాబితాలోకి చేరిపోయారు యంగ్ బ్యూటీ కయాదు లోహర్. ఇటీవల విడుదలైన తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం 'డ్రాగన్' సినిమాతో ఈమె పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.
'లవ్ టుడే' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు, నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ 'డ్రాగన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించగా.. అందరి దృష్టిని ఆకర్షించింది కయాదు.
అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో వచ్చే కయాదు లోహర్ క్యారెక్టర్ ఒక్కసారిగా హైలెట్ అయ్యి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.
గతంలో ఈమె టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు సరసన 'అల్లూరి' (2022) అనే పోలీస్ డ్రామా సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
అలాగే అందులో ఆమె పాత్ర పెద్దగా హైలైట్ కాకపోవడంతో అప్పట్లో తెలుగు ఆడియన్స్ ఈమెను పెద్దగా గుర్తుపెట్టుకోలేదు. కానీ డ్రాగన్ సినిమా తర్వాత సౌత్ ఇండస్ట్రీలో ఆమె లైఫ్ మారిపోయింది.
ఒకప్పుడు రిజెక్ట్ చేసిన వాళ్లే, ఇప్పుడు 'డ్రాగన్' సినిమాలో ఆమె నటనను చూసి "సౌత్ కొత్త క్రష్" అంటూ సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ తెగ షేర్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ నార్త్ బ్యూటీ అటు తమిళ తంబీలను, ఇటు తెలుగు ప్రేక్షకులను తన నటనతో మంత్రముగ్ధులను చేస్తోంది. నెట్టింట నిత్యం గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను కట్టిపడేస్తుంది ఈ వయ్యారి.