చంద్రముఖి వచ్చేసింది..

6 August 2023

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా  వస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’.

ఈ చిత్రానికి హీరోగా డ్యాన్స్ మాస్టర్, నటుడు రాఘవ లారెన్స్ చేస్తున్నారు. మొదటి చంద్రముఖి భాగంలో రజినీకాంత్ హీరోగా నటించారు. 

పి. వాసు దర్శత్వం వహిస్తున్నారు. సీక్వెల్ కావడంతో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు పి. వాసు. 

కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో కనిపించనుంది. మొదటి చంద్రముఖిలో జ్యోతిక ప్రధాన పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. 

ఇటీవల ఈ చిత్రం నుంచి  రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ లుక్‌కు విశేష స్పందన లభించింది. 

కాగా తాజాగా శనివారం  కంగనా ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. ఆమె చంద్రముఖిగా కనిపించనుందని చెప్పకనే చెప్పారు చిత్ర యూనిట్. 

ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలోనూ రిలీజ్ అవుతుంది. 

ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. త్వరలోనే పాటలను రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్.