25 August 2023

కమల్ జీ.. ఇండియన్ - 2 వస్తుందా..? ఎప్పుడు.?

ఇండియన్ 2 సినిమాను ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారోగాని ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది.

అసలు పూర్తిగా ఆగిపోయింది అనుకున్న టైమ్‌లో కమల్‌ చొరవ తిరిగి ప్రారంభమైంది. ఇప్పుడు ఈ మెగా మూవీకి మరో సమస్య ఎదురైంది.

వివాదాలతో కొంత కాలం ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు శంకర్‌. ఆ సమస్యను డీల్ చేసే బాధ్యత కూడా స్యయంగా కమల్‌ హాసనే తీసుకున్నారట.

విక్రమ్ సక్సెస్‌ జోష్‌, కమల్‌ చొరవతో రీస్టార్ట్ అయినా.. ఇప్పటికీ ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది.

తాజాగా ఇండియన్‌ 2 విషయంలో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అయ్యింది. ఈ సినిమా నిడివి ఐదు గంటలు దాటిపోవటంతో మేకర్స్‌ త్రీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారట

ఇండియన్ 2 తరువాత షార్ట్ గ్యాప్‌లో పార్ట్‌ 3 రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారన్న న్యూస్ వైరల్ అయ్యింది.

త్రీక్వెల్‌ విషయంలో కమల్‌ నిర్ణయం మరోలా ఉందట. ఇప్పుడు పార్ట్ 3 అంటే రెండు సినిమాల్లో స్లోగా అనిపించే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

పార్ట్‌ 3 విషయంలో ఆల్రెడీ డెసిషన్ తీసుకున్న కమల్‌ హసస్‌, సినిమా ఎడిటింగ్‌ బాధ్యతలు కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

తానే దగ్గరుండి సినిమాను ఎడిట్‌ చేయించి ఒకే మూవీగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి ఈ విషయంలో శంకర్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి.