యాక్షన్ మోడ్‌లోకి చిత్రలహరి బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్..

Rajeev 

09June 2025

Credit: Instagram

చాలా మంది హీరోయిన్ స్టార్ డమ్ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వారిలో కళ్యాణి ప్రియదర్శన్ ఒకరు. 

ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తున్నారు. కళ్యాణి కూడా అలా టాలీవుడ్ లో తన ముద్ర వేసింది. 

చేసింది తక్కువ సినిమాలే కానీ ప్రేక్షకుల గుండెల్లో ప్రింట్ అయ్యింది ఈ వయ్యారి. కానీ ఇప్పుడు తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు.. 

ఈ అమ్మడు తెలుగులో సినిమాలుతగ్గించడంతో అభిమానులు కూడా చాలా ఫీల్ అవుతున్నారు.

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. కానీ కళ్యాణి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది.ఆతర్వాత శర్వానంద్ తో రణరంగం అనే సినిమాలో నటించింది. 

ఆతర్వాత మలయాళంలో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు దుల్కర్ నీరిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ తో రానుంది కళ్యాణి.