కళ్యాణ్ రామ్ సరసన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అందం కాజల్. కృష్ణవంశీ అంతటి అందాన్ని ‘చందమామ’గా చూపించి ప్రేక్షకులకు కనుల విందు చేశారు.
ఆ తర్వాత వరుస సినిమాలతో హిట్లు కొట్టి స్టార్ స్టేటస్ అందుకుంది కాజల్. ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఇటీవలే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇటీవలే ఓ కొడుకుకు జన్మనిచ్చింది.
పెళ్లి తర్వాత కొంచెం గ్యాప్ కూడా ఇవ్వకుండానే ప్రెగ్నెంట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకు పోతోంది.
కాజల్ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు మూడు ప్రాజెక్టుల్లో కాజల్ నటిస్తోంది. అన్నీ భారీ ప్రాజెక్టులే. అందులో యువరత్న బాలకృష్ణ భగవంత్ కేసరి ఒకటి.
అలాగే శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఇండియన్ 2లో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఓ వేదికగాపై కాజల్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ హీరోలతో డేట్ కి వెళ్లాల్సి వస్తే ఎవరితో వెళ్తారు..? అనే ప్రశ్న ఆ సందర్భంలో కాజల్ కు ఎదురైంది.
అందుకు కాజల్ వెంటనే అక్కినేని నాగార్జునతో డేట్ కి వెళ్తానని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. దీంతో కొందరు కాజల్ ను తిట్టిపోస్తున్నారు.
టాలీవుడ్ లో ఇంతమంది యంగ్ హీరోలు ఉండగా.. తండ్రి వయసున్న హీరోతో డేట్ కి వెళ్తావా నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ ఆడిపోసుకుంటున్నారు.