16 August 2023

బ్లాక్ బస్టర్స్ సినిమాల  రికార్డును బీట్ చేసిన రజినీకాంత్ జైలర్

పిల్లలురా మీరు.. వెళ్లండి.. పక్కకెళ్లి ఆడుకోండి.. అదేదో సినిమాలో ఎమ్మెస్ నారాయణ చెప్పిన ఈ డైలాగ్ రజినీకాంత్‌కు బాగా సెట్ అవుతుందిప్పుడు.

మంచి నీళ్లు తాగినంత ఈజీగా.. చెప్పులేసుకున్నంత సులభంగా వచ్చి అలా రికార్డులు పట్టుకెళ్లిపోతున్నారు సూపర్ స్టార్.

తాజాగా జైలర్‌తోనూ చెడుగుడు ఆడుకుంటున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్

సీనియర్స్ ఫామ్‌లోకి వస్తే.. మ్యాటర్ మామూలుగా ఉండదు. ఇండస్ట్రీ రికార్డులను మడతబెట్టి తీసుకెళ్లిపోవడమే..!

తమిళ ఇండస్ట్రీలో ఇదే జరుగుతుంది ఇప్పుడు. రెండేళ్లుగా అక్కడ సీనియర్స్ మామూలుగా రెచ్చిపోవడం లేదు.. 

కొన్నేళ్లుగా జోరు మీదున్న జూనియర్స్‌ను పక్కన కూర్చోబెట్టేసారు. అటు కమల్.. ఇటు మణిరత్నం.. మరోవైపు రజినీ.. ఇలా అంతా మూకుమ్మడిగా దాడి మొదలుపెట్టారు.

జైలర్ 5 రోజుల్లోనే 380 కోట్లకు పైగా వసూలు చేసింది. కేవలం తమిళ వర్షన్ చూసుకున్నా మరో మూడు రోజుల్లో PS 1 రికార్డులు ఎగిరిపోవడం ఖాయం.

తమిళంలో అన్ని భాషలు కలిపితే 2.0 ఇప్పటికీ 670 కోట్లతో ఇండస్ట్రీ హిట్‌గా ఉంది. అయితే అక్షయ్ కుమార్ కారణంగా దానికి బాలీవుడ్ కలెక్షన్స్ హెల్ప్ అయ్యాయి.

కానీ తమిళంలో 2.0 వెనకబడింది. 2.0కు ముందు దళపతి, నరసింహా, చంద్రముఖి, శివాజీ, రోబో, కబాలి రూపంలో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు రజినీకాంత్.

తాజాగా జైలర్‌తో మరోసారి అదే సీన్ రిపీట్ చేస్తున్నారు. కమల్ ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి 23 ఏళ్లు పడితే.. రజినీకి జస్ట్ ఒక్క ఏడాది పట్టిందంతే.

అది కూడా వారం లోపే విక్రమ్, PS1 రికార్డుల్ని తుడిచేసారు. మొత్తానికి కోలీవుడ్‌కు రెండేళ్లలో 3 ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి.