అవును నిజం.. అతనంటే నాకిష్టం: రష్మిక మందన్న

09 November 2025

Pic credit - Instagram

Phani Ch

5 ఏప్రిల్ 1996న కర్ణాటక రాష్ట్రంలోని విరాజ్‌పేటలో కొడవ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ రష్మిక మందన్న.

ఈమె తండ్రి పేరు సుమన్, తల్లి పేరు మదన్ రష్మిక. కొడగులోని కూర్గ్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది.

బెంగుళూరులోని M.S.రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించింది.

2016లో కన్నడ రొమాంటిక్ కామెడీ చిత్రం కిరిక్ పార్టీతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. 2018లో నాగ శౌర్య చలోతో హీరోయిన్‎గా తెలుగు తెరకు పరిచయం అయింది.

ర‌ష్మిక ఓ పాడ్‌కాస్ట్‌లో అభిమానుల‌తో స‌ర‌దాగా మాట్లాడుతూ  వారు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు.  

ఈ సంద‌ర్భంగా ఓ అభిమాని ‘మీరు డేట్ చేస్తే ఎవ‌రితో చేస్తారు..? పెళ్లి చేసుకుంటే ఎవ‌రిని చేసుకుంటారు అని అడగగా ర‌ష్మిక క్రేజీ ఆన్సర్ ఇచ్చింది.

నరుటో (యానిమేషన్ పాత్ర)తో డేటింగ్ చేస్తానని.. అలాగే విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఇప్పుడు రష్మిక చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.