‘బిగ్ బాస్ 7’ లో వర్ష ఫిక్సా ??

‘జబర్దస్త్’ వర్ష పలు టిక్ టాక్ వీడియోలతో కెరీర్ ను మొదలు పెట్టింది.

ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో అలాగే యూట్యూబ్ లో షార్ట్స్ తో బాగా ఫేమస్ అయ్యింది.

అలా ఏర్పడిన ఫాలోయింగ్ వల్లే ‘జబర్దస్త్’ కామెడీ షోలో ఛాన్స్ దక్కించుకుంది.

ఈ షోలో ఆమె ఇమ్మాన్యూల్ తో కలిసి చేసే స్కిట్స్ బాగా ఫేమస్.

ఇక వర్ష త్వరలో బిగ్ బాస్ లో పాల్గొంటుంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

దానికి కారణం ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్.

వర్ష మాట్లాడుతూ.. నాకు సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి.

కానీ సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఎక్కువగా లేదు.

అయితే త్వరలో ఓ పెద్ద షోలో కనిపించబోతున్నాను. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసుకున్నాను.

మిగిలిన వివరాలు అన్నీ షోలోనే చెబుతాను” అంటూ చెప్పుకొచ్చింది.

పెద్ద షో అంటే అది బిగ్ బాస్ మాత్రమే.. అంటూ కొంతమంది నెటిజన్లు వర్ష మాటలను డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.