తనతో తానే తలపడనున్న ప్రభాస్.. ప్రాజెక్ట్ కె క్రేజీ అప్డేట్..
ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తుంది.
కమల్ హాసన్, అమితాబ్ బచ్చన, దిశా పటానీ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న చిత్రమిది.
వైజయంతి మూవీస్ పతాకంపై సి. అశ్వని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా మరో ఆసక్తికరమైన విషయం ఈ చిత్రంపై మరింత క్యూరియాసిటిని కలిగిస్తోంది.
ఇటీవల రెండు వేరు వేరు చేతులు ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టినట్లుగా ఓ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
అయితే అందులో ఆ రెండో చేయి కూడా ప్రభాస్ దేనాని చిత్రవర్గాల సమాచారం.
భూత, భవిష్యత్ కాలాల నుంచి ఈ చిత్రం కాన్సెప్ట్ ఉంటుందని తెలుస్తోంది.
రెండు కాలమానాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రభాస్ పాత్రలే కావచ్చని సమాచారం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి