24 August 2023
చిన్న సినిమాలపై డ్యూరేషన్ ఒత్తిడి.. క్రమంగా పెరుగుతున్న డ్యూరేషన్.
చిన్న సినిమా.. చింత లేని సినిమా.. కొన్నాళ్లుగా దర్శకులు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. అందుకే ఈ మధ్య ఏ సినిమా రెండున్నర గంటలకు మించట్లేదు.
కానీ ఇప్పుడిప్పుడే ఆ డ్యూరేషన్ విషయంలో పట్టువిడుపు ప్రదర్శిస్తున్నారు. కంటెంట్ ఉంటే లెంత్‌తో సమస్యేంటి అంటూ.. మూడు గంటల సినిమాలు చూపిస్తున్నారు.
ఆడియన్స్ భారీ ఎంటర్‌టైన్మెంట్ కోరుకుంటున్నారు.. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ భారీగానే ఉన్నాయి. మరి అవేంటి..?
ఈ మధ్య చాలా సినిమాలు రెండున్నర గంటల కంటే ఎక్కువ నిడివితోనే వచ్చాయి. గదర్ 2, జైలర్ సినిమాలు 2.50 గంటల నిడివితో వచ్చి 400, 500 కోట్లు వసూలు చేసాయి.
దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొత్త ఆగస్ట్ 24న విడుదల అయ్యింది ఈ మూవీ కూడా 2.56 గంటల నిడివితో వస్తుంది.
అలాగే సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఖుషీ సినిమా కూడా భారీ రన్ టైమ్‌తోనే వస్తుంది. ఈ చిత్రం 2.46 గంటల నిడివితో వస్తుంది.
అలాగే షారుక్ జవాన్ రన్ టైమ్ కూడా భారీగానే ఉంది. ఈ మూవీ 2.49 గంటలు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు అట్లీ.
జవాన్‌పై కేవలం బాలీవుడ్‌లోనే కాదు.. సౌత్‌లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా తమిళ ఆడియన్స్ కోసం డైలాగులు లిప్ సింక్ చేసారు కింగ్ ఖాన్.
మొత్తానికి కంటెంట్ బలంగా ఉండటంతో.. ఇలాంటి సినిమాలన్నీ భారీ రన్ టైమ్ తో భారీగానే వచ్చేస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి