03 AUGUST 2023
వాళ్ళ కోరికలు తీరిస్తే ఈపాటికి నేను స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని..: ఇనయా సుల్తానా
బిగ్ బాస్ తో మంచి క్రేజ్ దక్కించుకుంది ఇనయా సుల్తానా ప్రస్తుతం వరుస సినిమా అఫర్లతో బిజీగా ఉంది.
తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూకు హాజరై కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేసింది.
పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదని నేను చెప్పను. ఆ పరిస్థితిని నేను కూడా ఎదుర్కొన్నాను.
సినీ ఇండస్ట్రీకి వచ్చాక నన్ను ఎంతో మంది కమిట్మెంట్ అడిగారు.
కానీ నేను అంగీకరించలేదు. ఈ కారణంగా నేను చాలా మూవీ అవకాశాలు పోగోట్టుకున్నాను.
అంతేకానీ నేను మాత్రం లొంగలేదు. ఒకవేళ అప్పుడు దానికి ఒప్పుకున్నట్లయితే..
ఇప్పటికి పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ స్టార్ నటిని అయ్యేదాన్ని.
నేను ఇండస్ట్రీకి నటి అవ్వాలని వచ్చాను. కానీ ఇలాంటివి చేయాలని కాదు.
అంటూ ఇనయా సుల్తానా ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి