18 August 2023

సాయి పల్లవి అలా చేస్తే సినిమా ఫ్లాపేనా ??

Pic credit - Instagram

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సినిమాల కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారనే విషయం మనకు తెలిసిందే. 

ఈమె స్టార్ హీరోలైన కథకు తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే సినిమాలను అస్సలు ఎంపిక చేసుకోరు.

ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎలాంటి గ్లామర్ షో లేకుండా ఉండే సినిమాలకు మాత్రమే సాయి పల్లవి కమిట్ అవుతూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. 

ఈ విధంగా సాయి పల్లవి నటించిన సినిమాలలో అన్నీ కూడా దాదాపు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఈ సినిమాల ద్వారా ఈమె ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు..

కథల ఎంపిక విషయంలో ఏమాత్రం తొందరపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అనే సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం సాయి పల్లవి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయి

సాయి పల్లవి ఒక సినిమా కథ విని ఆ సినిమాలో తాను నటించనని రిజెక్ట్ చేస్తే తప్పకుండా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్నటువంటి వార్త వైరల్ గా మారింది. 

తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ విషయంలో కూడా అదే జరిగిందని తెలుస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ స్థానంలో మొదటగా సాయి పల్లవిని ఎంపిక చేసుకున్నారట. 

అయితే సాయి పల్లవి ఇందులో నటించనని చెప్పేశారు. ఇలా ఈ సినిమా మాత్రమే కాకుండా ఇదివరకు పలు సినిమాలలో కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేయడం ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయట.