రజినీకాంత్ సినిమాలో ఆ స్టార్ హీరో గెస్ట్ రోల్..
Rajitha Chanti
Pic credit - Instagram
13 June 2026
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'జైలర్ 2'. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఒక పవర్‌ఫుల్ అతిథి పాత్రలో మెరవబోతున్నట్లు సమాచారం.
'జైలర్ 2' లో ప్రత్యేక పాత్రలో నటించే విషయమై చిత్ర బృందంతో హృతిక్ రోషన్ జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి.
ఇందులో నటించడానికి హృతిక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ నెల 22వ తేదీ తర్వాత పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా నెల్సన్ సినిమాల్లో ఉండే క్యామియో (అతిథి) పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని నెట్టింట టాక్ నడుస్తుంది.
మొదటి భాగం 'జైలర్' లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్స్ ప్రత్యేక పాత్రల్లో అలరించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అదే బాటలో 'జైలర్ 2' లో హృతిక్ రోషన్ పాత్రను కూడా దర్శకుడు నెల్సన్ చాలా భారీ స్థాయిలో, ఫ్యాన్స్‌కు పూనకాలు రానుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రధాన చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు హృతిక్‌కు సంబంధించిన సీన్స్ షూట్ చేయనున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్