8 August 2023

పుట్టుకతో  వచ్చిన సమస్య.. హృతిక్‌ రోషన్‌‌కు‌  ఎన్నో అవమానాలు

Pic credit - Instagram

'కోయ్‌.. మిల్‌ గయా'.. బాలీవుడ్‌ అందగాడు హృతిక్‌ రోషన్‌ ఈ చిత్రంలో అమాయకపు పిల్లవాడిగా నటించాడు.

ఈ మూవీలో జరిగిన కొన్ని సంఘటనలు అతడి నిజ జీవితంలోనూ జరిగాయట. హృతిక్‌ రోషన్‌, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కోయ్‌.. మిల్‌ గయా. 

ఈ సినిమా వచ్చి నేటికి (ఆగస్టు 8) 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా హృతిక్‌ రోషన్‌ మాట్లాడుతూ.. 'ఈ సినిమా చేస్తున్నప్పుడే దీనితో నేను బాగా కనెక్ట్‌ అయ్యాను.

నా కెరీర్‌కు ఉపయోగపడుతుందని ఈ సినిమా చేయలేదు. నా మనసుకు నచ్చి చేశాను. 

రోహిత్‌ పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. స్కూలుకు వెళ్లే రోజుల్లో నాకు నత్తి ఉండేది. అది చూసి అందరూ వెక్కిరించేవారు. 

నేనేం మాట్లాడినా ఎగతాళి చేసేవారు. సినిమాలో రోహిత్‌ స్కూటీని ధ్వంసం చేస్తారు. అది నా లైఫ్‌లో కూడా జరిగింది. కాకపోతే అప్పుడు నేను సైకిల్‌ తొక్కేవాడిని. 

చిన్నతనంలో అదంటే నాకు ప్రాణం. కొందరు సీనియర్స్‌ వచ్చి నా సైకిల్‌ను నాశనం చేశారు. చాలా బాధేసింది. రోహిత్‌లాగే నాకూ పట్టరానంత కోపం వచ్చింది. 

ఈ అనుభవం వల్లే సినిమాలో ఆ సీన్‌లో సహజంగా నటించగలిగాను. దాని తీవ్రతను అర్థం చేసుకోగలిగాను.