ఇన్సూరెన్స్ పాలసీ నచ్చలేదా? క్యాన్సిల్ చేసుకోండిలా!
Anil Kumar
17 August 2024
ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారా? తీరా తీసుకున్న తరువాత అందులోని షరతులు, నిబంధనలు నచ్చకపోతే ఏంటి పరిస్థితి?
మీ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు మీరు తీసుకున్న పాలసీ పెద్దగా ఉపయోగపడదని తెలిస్తే అప్పుడేం చేయాలి? రద్దు చేసుకునే అవకాశం ఉందా?
పాలసీని పరిశీలించి, సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒక వేళ నచ్చకపోతే వెనక్కి ఇచ్చేయడానికి మీకు 30 రోజుల వ్యవధి ఉంటుంది అదే 'ఫ్రీ-లుక్ పీరియడ్'
కొన్ని ఖర్చులు మినహా పూర్తి ప్రీమియాన్ని తిరిగి పొందవచ్చు. అందుకే ఈ సదుపాయం గురించి కొత్తగా పాలసీ తీసుకునేవారు తప్పనిసరిగా తెలుసుకోవాలి
ప్రస్తుతం అనేక బీమా సంస్థలు తమ వెబ్‌సైట్ల ద్వారా పాలసీని రద్దు చేసేందుకు అనుమతిస్తున్నాయి అని తెలిసిందే.!
రద్దు అభ్యర్థనను ధ్రువీకరించుకొని, బీమా సంస్థ సదరు పాలసీని రద్దు చేస్తుంది. పాలసీదారులు చెల్లించిన ప్రీమియాన్ని తిరిగి చెల్లిస్తుంది.
మోసపూరితంగా ఇన్సూరెన్స్ పాలసీని అంటగట్టిన సందర్భాల్లో ఈ ఫ్రీ-లుక్ వ్యవధి రక్షణను అందిస్తుందని సమాచారం.
పాలసీదారు, బీమా సంస్థ మధ్య వివాదాలనూ తగ్గిస్తుంది. పాలసీదారులు బీమా పాలసీని కొనుగోలు చేసే ముందు, పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి