రానాకి మిహీక  ఎలా పరిచయం అయ్యారు.?

20 December 2024

Battula Prudvi

దగ్గుబాటి రానాకు, మిహీకకు ఎలా పరిచయం? ఈ విషయం గురించి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయట టాలీవుడ్ భల్లాలదేవకు.

ఇండస్ట్రీలో అందరూ తనని అలా అడుగుతుంటే అదో రకమైన ఆసక్తిగా అనిపించిందట టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటికి.

అందుకే ఆయన వెళ్లిన ఏ ఇంటర్వ్యూలైన ఎవరడిగినా ఎదో కొత్త కథ చెప్పడం మొదలుపెట్టారట అమరేంద్ర బాహుబలి అన్న.

అయితే, ఎవరికీ తెలియని ఒరిజినల్‌ విషయాన్ని మీతో చెబుతున్నా అంటూ ఓ ప్రముఖ షోలో చెప్పారు రానా దగ్గుబాటి.

కోవిడ్‌ లుక్ డౌన్ టైమ్స్ లో ఓ యాప్‌ రానా దగ్గుబాటిని, మిహీకని కలిపిందని అయన ఈ షోలో మనోజ్ తో చెప్పారు.

ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ ఎవరున్నారో.. అంటే కామన్‌ ఫ్రెండ్స్ ని పరిచయం చేసే యాప్‌ అట అది. ఒకసారి ఆ యాప్‌లో మిహీక కనిపించగానే రానా టచ్‌లోకి వెళ్లారట.

అంతకు ముందు ఎప్పుడో వారిద్దరి మధ్య పరిచయం ఉన్నప్పటికీ, కోవిడ్‌ టైమ్స్ లో వరుసగా ఒకటికి నాలుగు రోజులు నాన్‌స్టాప్‌గా మాట్లాడుకుంటూనే ఉన్నారట.

అప్పటిదాకా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని రానాకి, పెళ్లి ఆలోచన అప్పుడే మొదలైందట. ఆమె వెంటనే ఓకే చెప్పేయడంతో.. ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారని డీటైల్స్ చెప్పేశారు రానా.