అప్పటి అందంతో ఇప్పటికి ఎవర్ గ్రీన్ బ్యూటీలా శ్రియా అందాలు

Anil Kumar

09 December 2024

సీనియర్ బ్యూటీ అయినా కుర్రహీరోయిన్స్ కు పోటీ ఇస్తుంది శ్రియా శరణ్. ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది.

స్టార్ హీరోల సరసన నటిస్తూ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఈమె.

యంగ్ హీరోలతోనే కాదు సీనియర్ హీరోలతోనూ నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యింది.

తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి కుర్రహీరోల దగ్గర నుండి చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ లాంటి హీరోలతో ఆడిపాడింది శ్రియా.

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ హవా ఎక్కువ కావడంతో ఈ హాట్ బ్యూటీకి అవకాశాలు కాస్త కరువయ్యాయి.

ఈ మధ్య అడపాదడపా చిన్న చిన్న రోల్స్ లో కనిపిస్తూ.. యాడ్స్ చేసుకుంటూ తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది శ్రియా.

పెళ్లి చేసుకొని ఒక బేబీకు కూడా జన్మనించిన శ్రియా శరణ్ ఏ మాత్రం తగ్గని అందంతో కవ్విస్తుంది ఈ వయ్యారి బ్యూటీ.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ తన క్రేజ్ ని అలానే మైంటైన్ చేస్తుంది.