మళ్లీ గ్లామర్ సైడ్ వెళ్తున్న టాలీవుడ్ సీత.. మృణాల్ మెస్మరైజింగ్ పిక్స్

Anil Kumar

29 December 2024

దుల్కర్ హీరోగా సీతా రామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.

మృణాల్ ఆగస్టు-1-1992న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించారు. మృణాల్ ముంబైలోని KC కాలేజీ లో మాస్ మీడియా చదివారు.

ఆమె సినీ కెరీర్ విషయానికి వస్తే.. మృణాల్ 2014లో విడుదలైన మరాఠీ చిత్రం, విట్టి దండుతో సినీ రంగ ప్రవేశం చేశారు.

ఆమె 2019లో వికాస్ బహ్ల్ బయోపిక్ సూపర్ 30 నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2020లో నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌లో మంచి పాత్రలో మెరిశారు.

అదే సంవత్సరం ఠాకూర్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన తూఫాన్ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించారు.

రిసెంట్ గా షాహిద్ కపూర్‌తో కలిసి మృణాల్ నటించిన సినిమా జెర్సీ. ఈ సినిమా 2019 తెలుగు చిత్రం జెర్సీ రీమేక్‌గా వచ్చింది.

తెలుగులో మృణాల్‌ నటించిన 3వ చిత్రం విజయ్‌ దేవరకొండ హీరోగా ‘ఫ్యామిలీ స్టార్‌’. ఈ చిత్రంలో ఆమె ఇందుగా కనిపించారు.

ఇక తాజాగా మృణాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన క్యూట్ ఫొటోస్ కి తెలుగు కుర్రాళ్ళు సైతం మెస్మరైజ్ అవుతున్నారు.