చీరకట్టు అందాలతో కుర్ర హృదయాలకు గాళం వేస్తున్న మృణాళిని రవి క్యూట్

Anil Kumar

09 December 2024

మృణాళిని రవి.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

ఆ సినిమాలో క్యూట్ నవ్వు తో ఆకట్టుకుంటూ బుజ్జమ్మ అనే పాత్రలో చక్కగా నటించి మెప్పించింది మృణాళిని రవి.

ఆతర్వాత ఈ చిన్నది తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది మృణాళిని.

అక్కడ మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకొని.. వరస అవకాశాలతో దూసుకుపోతోంది ఈ  ముద్దుగుమ్మ.

ఇక ఈ అమ్మడు తెలుగులో మంచి ఛాన్స్ వస్తే.. నటించాలని చాలా కాలంగా ఎదురుచూస్తునట్టు పలు సార్లు తెలిపింది.

మృణాళిని రవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అభిమానులను రకరకాల ఫొటోలతో అలరిస్తుంది ఈ అమ్మడు.

మొదట డబ్స్మాష్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న మృణాళిని గద్దల కొండా గణేష్ మూవీతో ఫెమ్ వచ్చింది.

దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా ఆమె వీడియోలలో ఒకదాన్ని చూసి తనను ఆడిషన్ కోసం పిలిచి తన సినిమాలో ఎంపిక చేసారు.