నెమలి కన్నుల వయ్యారి.. కురాళ్ళ రాకుమారి.. మనసు దోచే మీనాక్షి..

Anil Kumar

06 December 2024

ఇండస్ట్రీలో ఎవర్నీ తక్కువగా అంచనా వేయకూడదు.. ఎవరి టైమ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం చాల కష్టం.

అదే దారిలో ఉన్నారు మన మీనాక్షి చౌదరి.. ఏకంగా టాలీవుడ్ సైలెంట్ కిల్లర్ అనేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ ని..

అసలు ఇంతకీ ఈ అమ్మడు ఏం చేసింది అనుకుంటున్నారా.? శ్రీలీల స్పీడ్ తగ్గగానే ఆ ప్లేస్ నాదే అంటుంది ఈ అమ్మడు.

2021లో హీరో సుశాంత్ తో హీరోయిన్‌గా మొదలైన ఈ బ్యూటీ ప్రయాణం.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు వచ్చింది.

ఇంతటితో ఆయిపోయింది అనుకోకండి.. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో అరడజను పైగా సినిమాలు ఉన్నాయి అంటున్నారు సినీ ప్రియులు.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో, వరస అవకాశాలతో తెలుగుతో పాటు తమిళంలోనూ దున్నేస్తున్నారు మీనాక్షి చౌదరి.

దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్‌, విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ, వరుణ్ తేజ్ మట్కా మూవీస్ లో నటిస్తుంది మీనాక్షి.

ఇక ఇప్పుడు మరోసారి రవితేజ - జాతిరత్నాలు అనుదీప్ సినిమాలో కూడా ఈ అమ్మడే ఫైనల్ అయ్యినట్టు టాక్ వినిపిస్తుంది.