ఇప్పటికైనా దర్శకత్వం వదిలేయ్.. స్టార్ డైరెక్టర్ పై కంగాన ఫైర్..

30-JUlY-2023

Pic credit - Instagram

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి తెలియని వారుండరు.

 నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది ఈ వయ్యారి.

తాజాగా దర్శకుడు కరణ్‌ జోహార్‌ ఇన్‌స్టా వేదికగా ఫైర్ అయింది.

అయన తెరకెక్కించిన ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’ చిత్రాన్ని విమర్శిస్తూ వరుస పోస్టులు పెట్టారు.

ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌పై తీవ్ర విమర్శలు కురిపించారు ఆమె.

‘‘ప్రేక్షకులను ఇక మోసం చేయలేరు. ఇలాంటి ఫేక్‌ సెట్స్‌, కాస్ట్యూమ్స్‌ను వాళ్లు అంగీకరించరు.

90ల్లో తాను తెరకెక్కించిన చిత్రాలనే కాపీ కొట్టి రూ.250 కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసినందుకు కరణ్‌ సిగ్గుపడాలి.

కరణ్‌.. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బును వృధా చేయడం మానేసి.. రిటైర్‌ అయిపో.

కొత్త టాలెంట్‌కు అవకాశాలు కల్పించు’’ అంటూ ఆమె మండిపడ్డారు.