తల్లి పాత్రలకే పనికొస్తావ్ అన్నారు: అపర్ణ బాలమురళి.. 

19 March 2025

Prudvi Battula 

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించి సురారై పొట్టు సినిమాతో వెండితెరకు పరిచయమైంది అపర్ణ బాలమురళి.

ఈ మూవీ తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో విడుదలైంది. మొదటి సినిమాతోనే నటనకు మంచి ప్రశంసలు అందుకుంది అపర్ణ.

అంతేకాదు.. సంప్రదాయ చీరకట్టులో అచ్చం తెలుగింటి అమ్మాయిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది అపర్ణ.

ఈ సినిమాలోని ఆమె పాత్రకు సౌత్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీతో ఏకంగా జాతీయ అవార్డ్ అందుకుంది నటి అపర్ణ.

అయితే సినిమా కెరీర్‌ ప్రారంభంలో తాను బాడీ షేమింగ్‌ని ఫేస్‌ చేసినట్టు తెలిపారు హీరోయిన్ అపర్ణ బాలమురళి.

తాను ఓన్లీ తల్లి పాత్రలకే పనికొస్తానని అది ముఖం మీదే చెప్పిన వారున్నారని.. గుర్తుచేసుకున్నారు ఈ బ్యూటీ.

సుధ కొంగర డైరక్ట్ చేసిన ఆకాశం నీ హద్దురా తర్వాత, తాను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదన్నారు నటి అపర్ణ.

హీరో ధనుష్‌‎తో చేసిన రాయన్‌ సినిమా కూడా తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందని తెలిపారు అపర్ణ బాలమురళి.