తెలుగువాడే అయినప్పటికీ తమిళంలో స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న విశాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
యాక్షన్ సినిమాలతో విశాల్ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. సినిమాలతో కంటే ఇతను వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.
మొదట వరలక్ష్మీ శరత్ కుమార్ తో ప్రేమాయణం నడిపాడు. తర్వాత నడిగర్ ఎలక్షన్స్ టైంలో శరత్ కుమార్ తో గొడవలు జరగడంతో వీళ్ళు బ్రేకప్ చెప్పేసుకున్నారు.
ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ ఫేమ్ అనీషా రెడ్డితో ఇతనికి ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ తర్వాత అది క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.
అయితే చాలా కాలం సింగిల్ గా ఉంటూ వచ్చిన విశాల్ త్వరలో హీరోయిన్ లక్ష్మీమీనన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం మొదలైంది.
’సుందర్ పాండియన్’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీ మీనన్ తర్వాత ‘కుమ్కీ’, ‘జిగర్తాండ’, ‘కుట్టిబులి’, ‘పాండియనాడు’ వంటి సినిమాల్లో నటించింది.
లక్ష్మి మీనన్ నటించిన చాలా వరకు సినిమాలు సక్సెస్ సాధించాయి. దీంతో కోలీవుడ్లో ఈమెను గోల్డెన్ లెగ్ అంటుంటారు.
విశాల్ తో కలిసి ఈమె నటించిన ‘ఇంద్రుడు’ ‘పల్నాడు’ సినిమాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. రియల్ లైఫ్ లో కూడా ఒక్కటి కాబోతున్నారన్న అంటూ టాక్.
కాకపోతే విశాల్ కి లక్ష్మీ మీనన్ కి మధ్య 18 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. లక్ష్మీ మీనన్ వయసు ఇప్పుడు 27 ఏళ్ళు మాత్రమే కావడం గమనార్హం.
మరి వీళ్ళ పెళ్లి వ్యవహారం పై అధికారిక ప్రకటన వస్తే తప్ప నిజమని చెప్పలేము. అయితే కొద్ది రోజుల క్రితం విశాల్ ‘నేను ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాను.
నాకు నిజమైన ప్రేమ దొరికింది. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.