పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్..

03 AUGUST 2023

హీరో, హీరోయిన్స్ కు సంబంధించిన పెళ్లి వార్తలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

స్టార్ హీరోలే కాదు కొంతమంది యంగ్ హీరోలు కూడా పెళ్లి ఊసు ఎత్తకుండా తమ సినిమాలతో రాణిస్తున్నారు.

ఈ మధ్య హీరో తరుణ్ పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

ఆయన ఓ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న బడా ఫ్యామిలోకి అల్లుడిగా వెళ్లనున్నారని జోరుగా ప్రచారం జరిగింది.

దాంతో ఈ వార్తల పై తరుణ్ క్లారిటీ ఇచ్చారు.

బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగులో అనేక సినిమాలు చేశారు.

తరుణ్ కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే తరుణ్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఎప్పటికప్పుడు ఆయన వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు తెరమీదకు వస్తూనే ఉంటాయి

తాజాగా పెళ్లి పై క్లారిటీ ఇచ్చారు. తన పెళ్లి గురించి వస్తున్న వార్త నిజం కాదు అని తేల్చి చెప్పారు తరుణ్.

నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా..

ఆ విషయం చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నారు తరుణ్.