అందాల భామ పాయల్ రాజ్ పుత్ సినిమాల స్పీడ్ తగ్గించిందే.. 

Rajeev 

08 June 2025

Credit: Instagram

పాయల్ రాజ్ పుత్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొత్తం 12 సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే హిట్టయ్యాయి.

యంగ్ హీరో కార్తికేయ సరసన ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.

తొలి చిత్రంలో ఓ రేంజ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించింది. ఫస్ట్ మూవీ హిట్టైనా ఆ తర్వాత మాత్రం వరుసగా నిరాశపరిచాయి

ఎన్టీఆర్: కథానాయకుడు, RDXలవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటిక, మంగళవారం వంటి చిత్రాల్లో నటించింది

కానీ వీటిలో మంగళవారం సినిమా తప్ప మిగిలినవేవి హిట్ కాలేదు. తెలుగుతోపాటు కన్నడ, పంజాబీలో పలు చిత్రాల్లో నటించింది.

కానీ అక్కడ సైతం నిరాశే ఎదురైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ చిత్రవిచిత్రమైన పోజులిచ్చింది.