ఈ క్యూట్ చిన్నారి.. ఇప్పుడు గ్లామర్‌కు కేరాఫ్.. ఎవరో గుర్తుపట్టారా

Ravi Kiran

06 Aug 2024

ఈ క్యూట్ చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈమె మరెవరో కాదు నేహ శెట్టి.

అందమెంత ఉన్న ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఓవైపు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. 

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డిజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా గ్లామర్ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి. 

ఈ సినిమాతో నేహాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో నేహాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

ఇటీవల 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'బెదురులంక 2012' చిత్రాలతో పలకరించింది ఈ భామ. 

అలాగే సిద్ధూ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న డీజే టిల్లు 2 లోనూ నేహా గెస్ట్ అప్పీరియన్స్ చేసింది. 

తాజాగా ఆమె ఇన్‌స్టా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.