ఆ కమెడియన్ తో డేట్.. గాయత్రీ శంకర్ గురించి వార్త వైరల్..
కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో నటి గాయత్రీ శంకర్ ఒకరు.
గతేడాది మామనితమ్, విక్రమ్ చిత్రాలలో తనదైన నటనతో ఆకట్టుకుంది.
2012లో '18 వయసు' చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది.
'నడువుల కొంజం పక్కత కానోమ్' అనే సినిమా ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది.
కాగా ఆమె ప్రముఖ స్టాండప్ కమెడియన్ అర్వింద్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి.
తాజాగా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఆమె అరవింద్ ఎస్‌ఏను కౌగిలించుకుంటూ ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది.
కమెడియన్‌గా అతని ఎదుగుదలను ప్రశంసిస్తూ అతనిపై తన గౌరవాన్ని వ్యక్తం చేసింది.
దీంతో ఈ వార్తకి మరింత బలం సమకూరింది. దీనిపై వీరిద్దరి నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి