సత్యభామ నుంచి ధృవ నక్షత్రం క్రేజీ సినిమా ముచ్చట్లు..
06 November 2023
కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ప్రేమకథ. ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఎవడు మనోడు…’ను హీరో ఆనంద్ దేవరకొండ రిలీజ్ చేశారు.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సత్యభామ. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు కాజల్.
ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ని దీపావళికి విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. ఇండియన్ టైమింగ్ ప్రకారం నవంబర్ 1 మధ్యాహ్నం రెండు గంటల 48 నిమిషాలకు ఈ పెళ్లి జరిగింది.
మెగా కుటుంబ సభ్యులు అంతా ఇండియాకు తిరిగి వచ్చేసారు. నవంబర్ 5, సాయంత్రం ఎన్ కన్వెన్షన్‌లో ప్రముఖులు, సన్నిహితుల కోసం వరుణ్ తేజ్ రిసెప్షన్ జరిగింది.
ఎప్పుడో ఆరేళ్ళ క్రితం ఆగిపోయిన ధృవ నచ్చతిరంతో త్వరలోనే రాబోతున్నారు విక్రమ్. గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్నారు. రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాను కరిచే కళ్లే అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ విడుదల చేసారు చిత్రయూనిట్. సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్.
సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ్ నటించిన 'ఆలంబన' సినిమాను డిసెంబర్ 15న తమిళ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల చేయనున్నారు.