ఓటీటీలోకి యానిమల్‌.. ఆ విషయంలో ఫ్యాన్స్‌ నిరాశ

26 January 2024

TV9 Telugu

సందీప్‌ వంగ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం యానిమల్.. మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

ఒక్క హిందీకే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా విడుదలనై అన్ని భాషల్లో ఈ సినిమా మంచి టాక్‌ సంపాదించుకుంది. 

అయితే ఈ సినిమాలో బోల్డ్‌ సీన్స్‌, యాక్షన్‌ సన్నివేశాలు మితిమీరి ఉన్నాయని కాస్త నెగిటివ్‌ ప్రచారం జరిగినా, ప్రేక్షకులు మాత్రం సినిమాకు ఫిదా అయ్యారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. 

అయితే ఓ విషయంలో సినీ లవర్స్‌ కాస్త నిరాశ చెందుతున్నారు. సందీప్‌ వంగ్‌ ఓటీటీకి సంబంధించి చెప్పిన విషయాలు ఇంప్లిమెంట్ చేయకపోవడమే దీనికి కారణం. 

యానిమల్‌ ఓటీటీలో మరికొన్ని సన్నివేశాలను జోడించి విడుదల చేస్తామని సందీప్‌ వంగ ప్రమోషన్స్‌లో తెలిపారు. 

అంతేకాకుండా సినిమా నిడివి కూడా ఓటీటీలో ఎక్కువగా ఉంటుందని సందీప్‌ అన్నారు. థియేటర్లలో 3.21 గంటల నిడివి ఉంటే ఓటీటీలో మరిన్ని సీన్స్ యాడ్‌ చేస్తామన్నారు. 

అయితే ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న సినిమాలో ఎలాంటి సన్నివేశాలు యాడ్‌ చేయలేదు. థియేటర్లలో వచ్చిన సినిమానే ఉంది. దీంతో ఆడియన్స్‌ నిరాశ చెందుతున్నారు.