సైలెంట్ అయిన సిమ్రాన్ చౌదరి.. ఈ అమ్మడికి ఆఫర్స్ రావడం లేదా..?

Rajeev 

09 july  2025

Credit: Instagram

 చాలా మంది హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంటారు అలాంటి వారిలో సిమ్రాన్ చౌదరి ఒకరు.

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సిమ్రాన్ చౌదరి. తొలి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది

 అలాగే నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది ఈ అమ్మడు. ఈ నగరానికి ఏమైంది సినిమా హిట్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు.

సరైన సినిమా కోసం చాలా కాలం ఎదురుచూసింది ఈ చిన్నది. దాంతో అంతగా క్రేజ్ కూడా తెచ్చుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పటి వరకు ఆరు చిత్రాల్లో నటించిన సిమ్రాన్ చౌదరికి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమానే గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఇకపోతే సిమ్రాన్ సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది. అడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది.

ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. నెట్టింట ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.