దుల్కర్ సల్మాన్ షాకింగ్ నిర్ణయం.. ఇక పై అలా

5 August 2023

మాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్.. తరువాత తెలుగు, హిందీ భాషల్లోనూ హీరోగా మంచి విజయాలు సాధించారు.

మణిరత్నం తెరకెక్కించిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

ఆతర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

హనురాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రజెంట్ హీరోగా బిజీగా ఉన్న దుల్కర్‌. నిర్మాతగానూ తన మార్క్‌ చూపిస్తున్నారు.

ఆల్రెడీ యాక్టింగ్‌, ప్రొడక్షన్‌తో ఫుల్ బిజీగా ఉన్న ఈ క్యూట్‌ హీరో.. మెగాఫోన్‌ పట్టుకోవాలని ఆశపడ్డారు

అప్పట్లో దర్శకుడిగా మారబోతున్నా అని హింట్ ఇచ్చినా.. ప్రస్తుతానికి ఆ డెసిషన్‌ వాయిదా వేశారు ఈ ఛార్మింగ్‌ స్టార్‌.

ప్రస్తుతం దుల్కర్ లైనప్‌ చూస్తే ఇప్పట్లో అది అయ్యే పని కాదంటున్నారు మాలీవుడ్ మేకర్స్‌.

ఏది ఏమైనా దుల్కర్ డైరెక్టర్ గా మారితే ఎలాంటి సినిమా తెరకెక్కిస్తాడో అని ఆయన అభిమానులు ఆలోచిస్తున్నారు.