ఆన్ స్క్రీన్ పై రెబల్ స్టార్ రెబలింగ్ చేయడమే కాదు... ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆఫ్ స్క్రీన్ పై సోషల్ మీడియా వేదికలో.. కూడా ఎప్పుడూ అదే పని చేస్తుంటారు.
ప్రభాస్‌ను.. ఆయన రికార్డులను ఎవరూ టచ్ చేసినా ఓ రేంజ్‌లో నెట్టింట ఆడేసుకుంటారు. ఇక ఇప్పుడు మరో సారి అదే పని చేస్తున్నారు ఈయన ఫ్యాన్స్.
షారుఖ్ జవాన్ బాహుబలి 2 రికార్డును టచ్ చేస్తుందని.. అలా కింగ్ ఖాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పేలారో లేదో.. ఇలా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చేస్తున్నారు.
ఎస్ ! కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో.. షారుఖ్ చేస్తున్న ట్రైలాంగ్వేజ్ ఫిల్మ్ జవాన్. ఇక సెప్టెంబర్ 7న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌లో అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.
మల్టీఫ్లెక్స్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఇప్పటికే 5.71 లక్షల టికెట్లను అమ్ముడయ్యేలా చేసుకుంది. అయితే ఈ నెంబర్ బాహుబలి2 అడ్వాన్స్ బుకింగ్స్ నెంబర్ 6.50లక్షల టికెట్లకు దగ్గరగా ఉండడంతో.. షారుఖ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఈ కేటగిరీలో జవాన్ బాహుబలి2 రికార్డును బద్దలు కొడుతుందని పోస్టులు పెడుతున్నారు.
ఇక ఈ పోస్టులను చూసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్.. షారుఖ్ కు వ్యతిరేకంగా నెట్టింట సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.
పిచ్చి పిచ్చి లెక్కలొద్దే.. ప్రభాస్ రికార్డ్ భద్రమే అంటూ..క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.