అరుంధతి డాన్సర్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందొ చూడండి..
25 May 2025
Prudvi Battula
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ లేడీ ఓరియెంటెడ్ మూవీ అరుంధతి అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టింది.
2009లో రిలీజ్ అయిన ఈ సినిమాకు అనేక అవార్డులు, రివార్డులు దక్కాయి. మొత్తం ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారాలను అందించింది.
అలాగే ఈ సినిమాతో ఇండస్ట్రీలో స్వీటీ పేరు మారుమోగిపోయింది. ఇందులో ఆమె నటనకు అభిమానులు, విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.
అరుంధతి మూవీతో స్టార్ డమ్ అందుకున్న అనుష్క.. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ అయ్యింది.
ఇక ఈ సినిమాలో కనిపించింది కాసేపు అయినప్పటికీ అందం, అభినయంతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆమె పేరు లీనా సిద్ధు.
అరుంధతి సినిమాలో అనుష్కకు చిన్ననాటి నుంచి నాట్యంలో శిక్షణ ఇస్తూ.. పశుపతి దుర్మార్గానికి బలైపోయే పాత్రలో ఆమె నటించింది.
లీనా సిద్ధు అరుంధతి సినిమా తర్వాత ఛార్మీ కావ్య’s డైరీ, లంక, హ్యాపీ హ్యాపీగా వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లీనా సిద్ధు.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.