చేసింది 12 సినిమాలు అందులో 10 ఫ్లాప్స్.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Rajeev
12 july 2025
Credit: Instagram
ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఈ మధ్య కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు.
మరికొంతమంది ఎంత ప్రయత్నించినా స్టార్ డమ్ అందుకోలేకపోతున్నారు. మరికొందరు మాత్రం తొలి చిత్రానికే హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు.
అలాంటి హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. హిట్స్ ప్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ ఈ అమ్మడుకు సరైన క్రేజ్ మాత్రం రావట్లేదు.
ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ఆమే పాయల్ రాజ్ పుత్. ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొత్తం 12 సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే హిట్టయ్యాయి.
యంగ్ హీరో కార్తికేయ సరసన ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ వయ్యారి..
మరోసారి అజయ్ దర్శకత్వంలో మంగళవారం అనే సినిమా చేసింది. కానీ ఈ బ్యూటీకి అనుకున్నంతగా ఆఫర్స్ మాత్రం రావడం లేదు.