22 June 2024

ఖాళీ సమయంలో తాప్సీ ఏం చేస్తుందో తెలుసా.? 

Narender.Vaitla

ఝుమ్మంది నాదం చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార తాప్సీ. తొలిసినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసిందీ చిన్నది.

ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకొని బిజీగా హీరోయిన్‌గా మారింది. అయితే తెలుగులో పలు పెద్ద సినిమాల్లో నటించినా ఆశించిన విజయాలు మాత్రం అందుకోలేకపోయింది.

ఇక ఎప్పుడైతే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందా తాప్సీ కెరీర్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగింది. బాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు దక్కించుకొని బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది.

ఇక సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో ఖాళీ సమయం దొరకడం సాధారణమైన విషయమే. మరి షూటింగ్ లేని సమయాల్లో తాప్సీ ఏం చేస్తుందంటే. 

గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాప్సీ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అందరిలా ఖాళీ సమయం దొరికితే విహార యాత్రలకు వెళ్లనని ఇంట్లోనే ఉంటానని చెప్పుకొచ్చింది.

ఉదయాన్నే లేవడం అంటే తనకు ఇష్టమని, లేచిన వెంటనే గ్రౌండ్ లో ఏదో ఒక ఆట ఆడడానికి ప్రయత్నిస్తానని తెలిపింది. షూటింగ్ ఉన్నా లేకపోయినా జిమ్‌ మాత్రం పక్కాగా చేస్తానని చెప్పుకొచ్చింది.

ఇక జిమ్‌ పూర్తయిన వెంటనే ఖాళీ సమయంలో ఎలాంటి పనులు పెట్టుకోనని, ఖాళీగా అలా ఇంట్లోనే ఉంటానని చెప్పుకొచ్చింది కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో జాలీగా టైమ్ గడిపేస్తానంది.

షూటింగ్ లేకపోతే కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో చిల్‌ అవుతానని. అంతా కలిసి భోజనం చేయడం, బయటకు వెళ్లడం లాంటివి చేస్తామని చెప్పుకొచ్చింది తాప్సీ.