మెయిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి శ్రీ గౌరి. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ సినిమా తర్వాత మనలో ఒకడుతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్న ఈ చిన్నది ఫిదా, రైటర్ పద్మభూషణ్ వంటి చిత్రాల్లో తళుక్కుమంది.
శ్రీ గౌరి కెరీర్ విషయానికొస్తే ఈ బ్యూటీ 2018లో మిస్ హైదరాబాద్ కిరీటాన్ని గెలుచుకుంది. అనంతరం నటన మీద ఆసక్తితో శ్రీ గౌరి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా మ్యాడ్ మూవీతో మరోసారి ప్రేక్షకులను తనవైపు తిప్పుకుందీ చిన్నది. ఈ సినిమాలో తనదైన నటన, అందంతో మెస్మరైజ్ చేసింది.
ఈ సినిమాలో శ్రీ గౌరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా విజయంలో హీరోయిన్ పాత్ర కూడా కీలకమని పలువురు క్రిటిక్స్ సైతం అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా నిత్యం టచ్‌లో ఉంటుందీ బ్యూటీ. ప్రస్తుతం ఈ బ్యూటీని ఇన్‌స్టాలో లక్షకుపైగా మంది ఫాలో అవుతున్నారు.
శ్రీ గౌరి ప్రియా రెడ్డి కేవలం నటనకు మాత్రమే పరిమితం కాలేదు. సింగర్‌గా కూడా తన ప్రతిభను చాటుకుంది. గతంలో ఓ సింగింగ్ కాంపిటేషన్‌లో పాల్గొంది.
కేవలం సింగింగ్ కాంపిటేషన్ ప్రోగ్రామ్స్‌లో మాత్రమే కాకుండా పలు చిత్రాల్లోనూ పాట పాడి అందంతోనే కాకుండా గాత్రంతోనూ మెస్మరైజ్ చేసిందీ చిన్నది.